Breaking News

Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌..

Published on Tue, 09/23/2025 - 13:48

కరీంనగర్‌ అర్బన్‌: నూతనంగా రేషన్‌ కార్డు పొందినవారంతా తస్మాత్‌ జాగ్రత్త. ఈ–కేవైసీ ఉంటేనే రేషన్‌ సరకులు ఇవ్వనున్నారు. తుది గడువంటూ లేకపోగా వీలైనంత త్వరగా సదరు ప్రక్రియ చేసుకోవడమే ఉత్తమం. ఇటీవల రెండు నెలల కాలంలో కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ–కేవైసీ తప్పనిసరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ–పోస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు అప్డేట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

రెండేళ్లుగా ఈ–కేవైసీ ప్రక్రియ...
రేషన్‌ కార్డులో ఉన్నవారందరూ ఈ–కేవైసీ నమోదు చేయుంచుకోవాలని రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తిచేసింది. అయితే ఇప్పటికీ అనేకసార్లు గడువు పొడిగించింది. కరీంనగర్‌ జిల్లాలో 3.01లక్షల రేషన్‌ కార్డులుండగా 40 వేల మందికిపైగా కొత్తరేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. కార్డులు మంజూరైన వారికి సెప్టెంబరు నెలలో బియ్యం కోటాకూడా విడుదలైంది. వారికి ఈ నెలలో బియ్యం పంపిణీ చేశారు. 32,577 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాతకార్డుల్లో జత చేశారు. పాత కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.

ఆధార్‌ అప్‌డేట్‌ లేక అవస్థలు..
ఆధార్‌ నవీకరణ(అప్డేట్‌) లేకపోవడంతో కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్డేట్‌ ప్రక్రియ పూర్తిచేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడంలేదు. కారణం తెలుసుకోవాలని బాధితులు ఇతర కేంద్రాలకు వెళ్లి వాకబు చేయగా.. ఆధార్‌ అప్డేట్‌ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.

 కరీంనగర్‌ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఆధార్‌ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై అధికారులు స్పందించి మరిన్ని ఆధార్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచితే ప్రజలకు ఉపయోగపడుతుందని పలువురు కోరుతున్నారు. కొత్త రేషన్‌ కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలని, సదరు ప్రక్రియకు తుది గడువు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు. 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)