Breaking News

నేడు హైకోర్టు నిర్మాణానికి భూమిపూజ

Published on Wed, 03/27/2024 - 04:36

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ వై. చంద్రచూడ్‌ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధేతోపాటు హైకోర్టు ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజేతో భేటీ సందర్భంగా హైకోర్టుకు నూతన భవన నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చిన విష యం తెలిసిందే.

ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవ నాన్ని నిర్మించి ఇస్తామని, త్వరలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను అదే రోజు ఆదేశించారు. అలాగే హైకోర్టును ఇక్కడి నుంచి తరలించినా.. ఇప్పుడున్న భవనాన్ని హెరిటేజ్‌ బిల్డింగ్‌గా పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకుంటామని రేవంత్‌ చెప్పా రు.

ఆ భవనాన్ని ఆధునీకరించి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టులకు వినియోగించుకునేలా చూస్తామని చెప్పిన విష యం విదితమే. ఆ తర్వాత మంత్రులు, న్యాయమూర్తులు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత జనవరిలో జీవో జారీ చేసింది. ఇదిలాఉండగా, బుధవారం శంకుస్థాపన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటుండటంతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)