Breaking News

పైలెట్‌గా 3 మండలాల్లో భూ భారతి

Published on Sun, 04/13/2025 - 05:52

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూ భారతి పోర్టల్‌ను తొలుత పైలెట్‌ పద్ధతిలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ పోర్టల్‌ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా దీనిని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మండలాల్లో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్‌ను మరింత బలోపేతం చేసి, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భూ భారతి, హౌసింగ్‌ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. 

ప్రజలు, రైతులకు అవగాహన సదస్సులు 
భూ భారతి ప్రారంబోత్సవం అనంతరం రాష్ట్రంలోని 3 మండలాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, ఆయా మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు.

ఈ మండలాల్లో నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ సదస్సులు నిర్వహించాలని, ప్రజల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్‌ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. 

అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి 
అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని, అర్హులనే ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్‌) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని, ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లైతే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. సిమెంట్, స్టీల్‌ తక్కువ ధరలకు అందేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)