Breaking News

రూ.180 కోట్ల మెడికల్‌ బిల్లులు క్లియర్‌

Published on Fri, 06/27/2025 - 05:15

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉ న్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులకు మోక్షం కలిగింది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి రూ.180.38 కోట్లను గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఉరట లభించినట్లయింది. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన వెంటనే ఉద్యోగులకు 2023 మార్చి నుంచి ఈనెల 20 వరకు వచ్చిన మెడికల్‌ బిల్లులన్నింటినీ చెల్లించడం విశేషం.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నా రు. ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలను పెంచుతూ ఈనెల 13న ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నా రు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 3.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరిందన్నారు.

డీఏ పెంపుతో ప్రభుత్వంపై ప్రతినెలా రూ. 200 కోట్ల లెక్కన ఏడాదికి రూ. 2,400 కోట్ల భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికా రుల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, జనాభాను అనుసరించి గ్రామపంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజి స్తున్నామన్నారు. వీటితోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆరోగ్య బీమా పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవు తోందని వెల్లడించారు. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డీపీసీల ఏర్పాటు వేగవంతమైందని చెప్పారు. కేవలం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 7.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావ డంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)