Breaking News

ఇబ్రహీంపట్నంలో పరువు హత్య!

Published on Tue, 03/19/2024 - 09:53

సాక్షి, రంగారెడ్డి: ఇ‍బ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సం చదువుతున్న భార్గవి, శశి అనే యువకుడు కొద్ది రోజలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక, వీరి ప్రేమ విషయమై గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శశితో మాట్లాడటం, కలవడం మానేయాలని తన తల్లి జంగమ్మ వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. భార్గవి ఇంట్లో ఉన్న ఉండగా శశి ఇటీవలే ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్గవి తల్లికి తెలియడంతో వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్బంగా శశినే పెళ్లిచేసుకుంటానని భార్గవి చెప్పడంతో జంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈలోపు.. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపినట్టు ఆనవాళ్లను ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక, శశి మృతిపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును చంపుకుంటుందా?. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. భార్గవి మాత్రం శశిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. నిన్న శశి మా ఇంటికి వచ్చాడు. నా భార్యను చూసిన వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగింది అని చెప్పారు. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)