Breaking News

భారత్‌ గౌరవ్‌ స్పెషల్‌ రైలు.. సికింద్రాబాద్‌ నుంచే

Published on Thu, 07/24/2025 - 19:14

సాక్షి, హైదరాబాద్‌: జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు అంబేడ్కర్‌ జన్మస్థలం, ఆయన బౌద్ధమతం స్వీకరించిన ప్రాంతాలను చుట్టివచ్చేలా ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును (Bharat Gaurav Tourist Train) ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ రైలు టూర్‌ 24వ తేదీ వరకు (8 రాత్రులు– 9 రోజులు) కొనసాగుతుంది. 

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగాలను, నాగ్‌పూర్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరం, నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, పుణేలోని భీమశంకర్‌ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లోని గ్రిషే్ణశ్వర్‌ జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు మోవ్‌ వద్ద అంబేడ్కర్‌ జన్మస్థలం, ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్తూపం ప్రాంతాలను కూడా చుట్టి వస్తుంది.

సికింద్రాబాద్‌తోపాటు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్‌ – పూర్ణ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఆయా ప్రాంత పర్యాటకులు ఆ స్టేషన్లలోనే రైలు ఎక్కి, దిగేందుకు వీలుంటుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి ఉంటుందని పేర్కొంది. పర్యాటకులకు అవసరమైన ఎస్కార్ట్‌ భద్రత (సీసీటీవీ కెమెరాలు సహా) ఉంటుందని వివరించింది. పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సౌకర్యం, ప్రయాణ బీమా వసతి ఉంటుందని ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది.  

డబుల్‌/ట్రిపుల్‌ షేర్‌ టికెట్‌ ధరలు
స్లీపర్‌ రూ. 14,700 (నాన్‌ ఏసీ హోటల్‌ గది – షేరింగ్‌), 3 ఏసీ రూ. 22,900 (ఏసీ హోటల్‌ గది – షేరింగ్‌), 2 ఏసీ రూ. 29,900 (ఏసీ హోటల్‌ గది నాన్‌ షేరింగ్‌), పిల్లల(5–11 వయసు)కు స్లీపర్‌ రూ.13,700, 3 ఏసీ రూ. 21,700, 2ఏసీ రూ. 28,400 బుకింగ్‌ కోసం: 9701360701, 9281030712, 9281030711 నంబర్లలో.. ఆన్‌లైన్‌ బుకింగ్‌ల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌:  www.irctctourism.comను సందర్శించవవచ్చని ఐఆర్‌సీటీసీ సూచించింది. 

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో పెరుగుతున్న e వ్యర్థాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)