Breaking News

మెట్లబావుల పునరుద్ధరణకు భారత్‌ బయోటెక్‌ సాయం!

Published on Sat, 09/28/2024 - 11:12

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన మెట్లబావులను పునరద్ధరించేందుకు ప్రముఖ వ్యాక్సీన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ముందుకొచ్చింది. నీటి వనరుల సంరక్షణతోపాటు జీవనోపాధులను పెంచేందుకు, ఎకో టూరిజానికి ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. 

ఇందులో భాగంగా ‘ద సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎండవర్‌’ క్లుప్తంగా సాహె అమ్మపల్లి, సాలార్‌ జంగ్‌ సంగ్రహాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలకు తమవంతు సాయం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్‌ల సమక్షంలో భారత్‌ బయోటెక్, సాహేల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా తాము మెట్లబావుల పునరుద్ధరణకు సాయం అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా తెలిపారు. మెట్లబావుల పునరుద్ధరణతోపాటు వీటి ప్రాశస్త్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తామని అమ్మపల్లి, సాలార్‌ జంగ్‌ సంగ్రహాలయాల్లోని మెట్లబావులు అటు పల్లెల్లో ఇటు నగరాల్లోనూ కీలకమైన నీటి వనరులగా సేవలందించాయని చెప్పారు. అమ్మపల్లిలోని మెట్లబావి 13వ శతాబ్దానికి చెందినదైతే.. సాలార్‌ జంగ్‌ సంగ్రహాలయంలోనిది కుతుబ్‌ షాహీల కాలం నాటిదని గుర్తు చేశారు. 

ఢిల్లీలోని అగ్రసేన్‌ కి బౌలీ, అహ్మదాబాద్‌లోని రాణీ కి వావ్‌లు యునెస్కో గుర్తింపు పొందాయని,  చిన్న బావుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో వీటి అవసరం లేక పోవడంతో కొన్ని చోట్ల చెత్తకుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భూగర్భ జల వనరుల వాడకం అత్యధికంగా ఉందని యునెస్కో సైతం హెచ్చరించిన నేపథ్యంలో.. మెట్లబావుల వంటి నీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)