Breaking News

మకోడి–సిర్పూర్‌ రైల్వే ట్రాక్‌పై పెద్దపులి

Published on Wed, 12/11/2024 - 04:52

కాజీపేట రూరల్‌/ సిర్పూర్‌ (టి)/ములుగు/వెంకటాపురం(కె): రైల్వే ట్రాక్‌ పై ఒక్కసారిగా పెద్దపులి కనిపించడంతో రైల్వే గ్యాంగ్‌మన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు రైల్వే స్టేషన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే సబ్‌ డివిజన్‌ పరిధి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–మకోడి రైల్వే స్టేషన్‌ల మధ్య అన్నూర్‌ గ్రామంలో మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న పులిని గ్యాంగ్‌మన్లు చూశారు. 

ట్రాక్‌ దాటుతున్న వీడియో తీశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా సెక్షన్‌లలో గల దట్టమైన అటవీ ప్రాంతాల సమీపంలో గల రైల్వే స్టేషన్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులి తెలంగాణ సరిహద్దులో నుంచి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి కావలి కారిడార్‌ దట్టమైన ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. 

కాగా, సిర్పూర్‌ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై మంగళవారం వేకువజామున పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు.  

బోధాపురం అటవీ ప్రాంతంలో బెంగాల్‌ పులి ఆనవాళ్లు 
ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా భావిస్తున్న ఈ పెద్దపులి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్‌ అటవీ ప్రాంతాలను దాటి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బోధాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారి చంద్రమౌళి నిర్ధారించారు. 

ఈ పులి బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి మంగపేట మండలం మల్లూరు వైల్డ్‌ లైన్‌ జోన్‌ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బోధాపురంతో పాటు ఆలుబాక గ్రామాల శివారుల్లోని గోదావరి లంకల్లో సాగు చేసిన పుచ్చతోట వద్ద సోమవారం రాత్రి సంచరించిందని, పెద్దగా గాండ్రించినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. 

తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు మంగళవారం ఉదయం పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారించారు. పులులకు ఇది మేటింగ్‌ సమయం కావడం వల్ల గత ఏడాది ఇదే సమయంలో ఆడపులి ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లానుంచి ఏటూరునాగారం వైల్డ్‌ లైన్‌లో (ఎస్‌1) సంచరించింది.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)