Breaking News

గుండెపోటు కాదు.. ఆత్మహత్యే

Published on Tue, 12/09/2025 - 13:29

కొండాపూర్‌(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్‌ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్‌ చౌరస్తాలోని గీతానగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ కుటుంబం నివాసం ఉంటోంది. 

ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్‌ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్‌ మండలం మద్వార్‌కు తీసుకెళ్లారు. 

అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్‌ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు