Breaking News

భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..

Published on Sun, 08/13/2023 - 02:14

కొత్తపల్లి (కరీంనగర్‌): కరీంనగర్‌ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్‌ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్‌ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్‌ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది.

ఎస్సారెస్పీ కెనాల్‌ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం  గమ­నిం­చిన స్థానికులు పోలీసులు, అటవీ­శాఖ అధికారు­లకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్‌ నుంచి వచ్చిన ఫారెస్ట్‌ రెస్క్యూ టీం రేకుర్తి సబ్‌స్టేషన్‌ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పా­టు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేల­కు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)