Breaking News

కులగణనతో బీసీల దశ తిరుగుతుంది

Published on Sun, 05/11/2025 - 03:53

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని బీసీల్లో చైతన్యం లేకపోవడం వల్లే కులగణన ఇంతకాలం జరగలేదని ఉత్తరప్రదేశ్‌ బీసీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్‌ అన్నారు. విద్య, రాజకీ య రంగాల్లో బీసీలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం జనగణనలో భాగంగా కులగణన కచ్చితంగా చేసి తీరుతుందని స్పష్టంచేశారు. ఈ ప్ర క్రియ పూర్తయితే బీసీలకు అన్ని రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. 

బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ సెంటర్‌ ఫర్‌ ఎంపవర్మెంట్‌ (బీసీసీఈ) ఆధ్వర్యంలో శనివారం సో మాజిగూడలోని ఓ హోటల్‌లో కులగణన అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కశ్యప్‌ మాట్లాడుతూ.. ఓబీసీల్లో నకిలీ ఠాకూర్, నకిలీ బ్రాహ్మణులు ఉన్నారని సైమన్‌ కమిషన్‌ చెప్పిందని, ఆర్టికల్‌ 340 లేకుంటే ఇప్పటి వరకు ఓబీసీ కేటగిరీ ఉండేదే కాదని అన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్‌ను చేర్చడం వల్లే బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్‌ ఫలాలు దక్కాయని తెలిపారు. 

కాంగ్రెస్‌ వల్లే కులగణన ఆగింది 
దేశంలో జనగణనలో భాగంగా చేపట్టాల్సిన కులగణన కాంగ్రెస్‌ వల్లే ఆగిపోయిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనగణనలో కులగణన అవసరం లేదని ఆ కాలమ్‌ను తొలగించారని, అప్పటి నుంచి కులగణన ఆగిపోయిందని తెలిపారు. 

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రధానమంత్రులుగా పనిచేసినా కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు రాహుల్‌గాంధీ కులగణన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల సర్వే చేసి మతప్రాతిపదికన లెక్కలు చెప్పిందని ఆరోపించారు.

ఎవరివాటా ఎంతో తేలుతుంది 
జనగణనతో పాటే కులగణన చేపడితే దేశ జనాభాలో ఎవరి వాటా ఎంతనేది స్పష్టత వస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయని, అత్యంత అల్పసంఖ్యాక కులం నుంచి కూడా ఐఏఎస్‌ అధికారి అయ్యే వీలుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీల బతుకులు కచ్చితంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)