Breaking News

జేఏసీగా బీసీలు!

Published on Sun, 10/12/2025 - 02:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాలు, మేధావుల నుంచి జేఏసీ ఏర్పాటు డిమాండ్‌ విన్పిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓపై హైకోర్టు స్టే ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు బ్రేక్‌ పడడం లాంటి పరిణామాలను బీసీలు జీర్ణించుకోలేక పోతున్నారు.

జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో చేతికి అందివచ్చిన అవకాశాన్ని. .తాజా పరిణామాలు లాగేసుకున్నట్టు చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ వర్గాలు నిర్ణయించాయి.

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ
శనివారం రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన బీసీ కుల సంఘాల సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఆదివారం కాచిగూడ లో రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొనను న్నట్లు సమాచారం.

ఈ సమావేశం అనంతరం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచ రణ సమితిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ నెల 14న రాష్ట్ర బంద్‌కు కృష్ణయ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 30 బీసీ అనుబంధ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)