Breaking News

గబ్బిలాలకు కేరాఫ్‌.. కోమటిపల్లి

Published on Sun, 07/20/2025 - 09:01

కేసముద్రం: ఏ గ్రామంలోనైనా ఒకట్రెండు గబ్బిలాలు కనిపిస్తేనే కీడు సోకుతుందని భయాందోళనకు గురవుతుంటారు. కానీ ఈ గ్రామంలో వందల సంఖ్యలో ఆవాసం ఏర్పాటు చేసుకున్న గబ్బిలాలను అక్కడి ప్రజలు పరిరక్షిస్తూ, వాటిపట్ల ప్రేమను చూపుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం గబ్బిలాలకు ఆవాసంగా మారింది. గ్రామంలో మొదటి నుంచి శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం పక్కనున్న మర్రి, రావి వృక్షాలపై వందల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. క్రమక్రమంగా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చాయి. 

తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గబ్బిలాలన్నీ శబ్దాలు చేస్తూ, ఊరంతా తిరుగుతూ వచ్చి వృక్షాలపై వాలుతాయి. అదే సమయంలో గ్రామస్తులు తెల్లవారిందనే సంకేతంతో నిద్రలేచేవారని స్థానికులు చెబుతుంటారు. వేసవికాలం వచి్చందంటే వడగాలులకు తట్టుకోలేక ఆలయంలో పక్కనున్న చెట్లపై నుంచి గ్రామసమీపంలోని చెరువువద్ద ఉన్న మర్రి, రావి వృక్షాలపైకి చేరుతాయి. ఎండ తీవ్రత, వడగాలులతో గబ్బిలాలు ఆకుల్లా రాలిపోతున్న దశలో దాత అందించిన స్ప్రింక్లర్‌ల సాయంతో చెట్లపైనున్న గబ్బిలాలకు నీళ్లను చల్లుతూ బతికించుకుంటారు. 3 వేలకు పైగా గబ్బిలాలుండటంతో కోమటిపల్లి గ్రామం గబ్బిలాలకు కేరాఫ్‌గా మారింది.  

నా చిన్నతనం నుంచి చూస్తున్నా 
మా ఊరిలోని శ్రీలక్ష్మీనారాయణస్వా మి ఆలయం పక్కనున్న చెట్లపై గబ్బిలాలు ఉండటం నా చిన్నతనం నుంచి చూస్తున్నా. గబ్బిలాలంటే అందరూ భయపడతారు. కానీ మా గ్రామంలో వందల సంఖ్యలో ఉన్న గబ్బిలాలను సంరక్షిస్తుంటాం. వేసవికాలం వచి్చందంటే అవి చనిపోకుండా స్ప్రింక్లర్‌లతో నీళ్లు చల్లిస్తూ బతికించుతాం.  
– జి.యాదగిరి, గ్రామస్తుడు 

మా గ్రామానికి ప్రత్యేకత 
మా గ్రామంలో కొన్నేళ్లుగా గబ్బిలాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమక్రమంగా వాటిసంఖ్య పెరుగుతూ వచ్చింది. గబ్బిలాలతో మాకు కీడు సోకుతుందనే భయంలేదు. పైగా వాటిని సంరక్షిస్తూ, మా గ్రామప్రజలు ప్రేమను చాటుతుంటారు. చుట్టుపక్కల ఏ గ్రామంలో గబ్బిలాలు కనిపించవు. మా ఊరిలోనే వందల సంఖ్యలో గబ్బిలాలు సంచరించడం, వృక్షాలపై ఆవాసం ఏర్పరుచుకున్నాయి. అందుకే మా గ్రామం గబ్బిలాలకు ప్రత్యేకతగా నిలుస్తుంది.  
– రావుల మల్లేశం, గ్రామస్తుడు   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)