Breaking News

బయటకు రాని బతుకమ్మ చీరలు!

Published on Thu, 10/23/2025 - 06:26

హైదరాబాద్‌: బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు ఇప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని గోదాములకే ఈ చీరలు పరిమితమయ్యాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలందరికి రేషన్‌ కార్డుల ప్రాతిపదికన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఇందిరా మహిళా శక్తి పొదుపు సంఘాల మహిళలకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు గత నెల 25 వేల చీరలు మలక్‌పేటకు చేరాయి. 

అయితే ఇవి సరిపోవని తేలడంతో..మిగతా చీరలు వచ్చాక పంపిణీ చేసేందుకు అధికారులు పండగకు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ గడువులోగా మిగతా చీరల దిగుమతి జరగలేదు. ఈ కారణంతో బతుకమ్మ వేడుకలకు చీరల పంపిణీ చేపట్టలేదు. అన్ని సర్కిళ్ల పరిధిలోని వార్డు కార్యాయాల్లో పొదుపు సంఘం ఖాతా బుక్కును చూపించి పేర్లు నమోదు చేసుకొన్న మహిళలకు చీరల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పంపిణీ జరగకపోవడంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొందరు మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారని తెలిసింది. నవంబర్‌ 19న మాజీ ప్రధాని ఇంధీరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తారని చర్చించుకుంటున్నారు.  

మలక్‌పేటలో 50 వేల చీరలు..  
జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌ కార్యాలయాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు వార్డు కార్యాలయంలో అధికారులు పంపిణీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆరు డివిజన్లలో 25 వేల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పొదుపు మహిళకు 2 చీరల చొప్పున మొత్తం 50 వేల చీరలు పంపిణీ చేయనున్నారు.

అర్బన్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో.. 
ఆయా డివిజన్‌ పరిధి వార్డు కార్యాలయాల్లోనూ ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. పొదుపు సంఘాల మహిళల రుణాలు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ (యూసీడీ) అధికారుల పర్యవేక్షణలో చీరలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మహిళా సంఘం పరిధిలో 8 నుంచి 13 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఒక్కో మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించే బాధ్యతలను ఆయా డివిజన్‌ అర్బన్‌ కమ్యూనిటీ ఆఫీసర్‌ నేతృత్వంలో రీసోర్స్‌ పర్సన్లకు అప్పగించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చేనెలలో ఈ మహిళలకు ఇందిరమ్మ చీరలు అందుతాయని భావిస్తున్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)