Breaking News

Hyd: గిన్నిస్‌ రికార్డులో ‘మన బతుకమ్మ కార్నివాల్‌’

Published on Mon, 09/29/2025 - 18:45

హైదరాబాద్‌:  దసరా ఉత్సవాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన ఓ బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సాధించింది. సరూర్‌నగర్‌ స్టేడియంలో ఈరోజ(సెప్టెంబర్‌ 29) నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూలయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్‌ రికార్డుల్లోకి  ఎక్కింది.  

‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.. చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా’అంటూ బతుకమ్మ పాటలతో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం మార్మోగింది.. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి.. ఒకే వేదికపై సుమారు దివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశరు. మన బతుకమ్మ కార్నివాల్‌ పేరుతో ఈ వేడుక నిర్వహించారు.   ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా  గిన్నిస్‌లో రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. 

నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సరూర్‌నగర్‌ వేదికగా  ఈ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ఈవెంట్‌’కు భారీ ఏర్పాట్లు  చేశారు. ఇండోర్‌ సహా అవుట్‌ డోర్‌ స్టేడియాల్లో 64 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేశారు.

గ్రేటర్‌ జిల్లాలు సహా సరిహద్దు జిల్లాల నుంచి 200 బస్సుల్లో మహిళలను ఆదివారం ఉదయమే స్టేడియానికి రప్పించి, ఆయా పాటలకు శిక్షణ ఇప్పించారు. వేడుకలో భాగంగా పాడే పాటలు, ప్రదర్శనలపై ముందే రిహార్సల్స్‌ చేశారు.  


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)