Breaking News

బరాజ్‌లపై నిర్ణయం కేసీఆర్‌దే

Published on Wed, 06/18/2025 - 01:05

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. గత ప్రభు త్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్‌ల నిర్మాణంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. కేసీఆర్‌ స్వయంగా తీసుకున్న నిర్ణ యాల మేరకే బరాజ్‌లను నిర్మించారని తేల్చి చెప్పింది. 

బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఈ నెల 11న కేసీఆర్‌కు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వ హించగా, మంత్రివర్గ నిర్ణయాల మేరకే బరాజ్‌లను నిర్మించినట్టు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో నాటి మంత్రివర్గ సమా వేశాలకు సంబంధించిన మినట్స్‌ కాపీలను సమర్పించాలని కమిషన్‌ 13న రాష్ట్ర ప్రభు త్వానికి లేఖ రాసింది. అదే రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్‌ బొజ్జా కమిషన్‌ను కలిసి వివిధ మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన మినట్స్‌ కాపీలను అందజేశారు.

బరాజ్‌ల నిర్మాణంపై మంత్రివర్గ నిర్ణయాలేమీ జరగలేదని, మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రమే నిర్ణ యం తీసుకున్నారని ఆయన కమిషన్‌కు రాతపూర్వకంగా లేఖ ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి కమిషన్‌ విచారణ ప్రారంభించిన వెంటనే కాళేశ్వ రం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కమిషన్‌ కార్యాలయా నికి అందజేసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. కమిషన్‌ మంత్రివర్గ నిర్ణయాలను కోరడంతో మళ్లీ అందజేసినట్టు వెల్లడించాయి.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)