నా భర్త లాస్ట్‌స్టేజీలో ఉన్నారు.. హోంగార్డు నాగమణి వీడియో వైరల్‌

Published on Fri, 09/08/2023 - 08:16

ఖలీల్‌వాడి: సీఎం సారూ.. హోంగార్డులను పర్మినెంట్‌ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. గురువారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్‌ భార్య అనుభవిస్తున్న బాధను తాను కూడా అనుభవిస్తున్నట్లు చెప్పారు.

‘‘నా భర్త సాయికుమార్‌ లాస్ట్‌స్టేజీలో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నాం.. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాలా చాలా మంది హోంగార్డులు తమ వ్యక్తిగత బాధలను చెప్పుకోలేక పోతున్నారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నాం.

హాస్పిటల్‌ ఖర్చులు, స్కూల్‌ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం.. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నామే గాని మావి విలువ లేని బతుకులు.. సీఎం సారు హోంగార్డులను పర్మినెంట్‌ చేస్తామని గతంలో చెప్పారు అందుకే అడుగుతున్నాం..హోంగార్డు యూనియన్‌ నేతలైన ఏడుకొండలు, ప్రేమ్, రాజేందర్, ఇబ్రహీం, వెంకటేశ్, శివన్న సీఎం సార్‌కు ఈ వీడియోను చేరే వరకు పంపండి’’అని ఆ వీడియోలో కోరారు. తామూ తెలంగాణ బిడ్డలమేనని హోంగార్డులకు న్యాయం చేస్తే సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టుకొని బతుకుతామని ఆ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు.
చదవండి: హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)