Breaking News

అడిగింది ఇస్తావా?.. మన వీడియో లీక్‌ చేయమంటావా..

Published on Fri, 05/30/2025 - 11:24

సాక్షి, బంజారాహిల్స్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడు లంచ్‌కు తన ఇంటికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అనంతరం, ఆమె ఫోటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ కోటి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. దీంతో, బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–7లో నివసించే మహేంద్రవర్ధన్‌ అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. తాను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థినని మహేంద్ర ఆమెను పరిచయం చేసుకున్నాడు. 2023 ఆగస్టు 15న ఇద్దరూ కలిసి మహేంద్ర ఇంటికి లంచ్‌ కోసం వచ్చారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇవ్వడంతో నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మెళకువ వచ్చి చూసుకునేసరికి బాధితురాలు జరిగిన విషయాన్ని గమనించి షాక్‌కు గురైంది.

ఈ విషయంలో మహేంద్రవర్ధన్‌ కొంతకాలంగా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. దీంతో ఆమె రూ.20 లక్షల వరకు చెల్లించుకుంది. ఫోటోలు బయటపెడతానని, బండారం అందరికీ తెలియజేస్తానని రోజురోజుకు నిందితుడి వేధింపులు పెరిగిపోవడంతో పాటు ఇటీవల రూ. కోటి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్‌ 64(1), 308 (2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)