Breaking News

బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌ ఘటన.. డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

Published on Tue, 04/18/2023 - 13:14

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌ డ్రైవర్‌ అకృత్యాలపై కోర్టు తీర్పు వెల్లడించింది. గతేడాది డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చుతూ.. శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన డ్రైవర్‌ రజినీకుమార్‌కు నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇదే కేసులో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాదవి రెడ్డిని నిర్ధోషిగా తేల్చింది.

కాగా గతేడాది బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్‌ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. ఈ విషయమై విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున  ఆందోళనలు నిర్వహించారు.

ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడంతో.. ప్రభుత్వం స్కూల్‌ గుర్తింపును రద్దు చేసింది. అనంతరం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నవంబర్‌లో పాఠశాల తిరిగి తెరుచుకుంది. అక్టోబర్‌ 19న నిందితుడిని, నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జి హెచ్‌ఎం మాధవిల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆరు నెలల దర్యాప్తు, విచారణ తర్వాత కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది.
చదవండి: దంచికొడుతున్న ఎండలు, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.. తస్మాత్‌ జాగ్రత్త!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)