Breaking News

బంగ్లాదేశ్‌ యువకుడికి బర్త్‌ సర్టిఫికెట్

Published on Wed, 04/23/2025 - 08:35

మణికొండ: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ అయింది. దీని ఆధారంగా అతడు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్‌ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో పాటు సదరు బంగ్లాదేశీయుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుదీర్‌ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నాడు. 

దీనికి ముందు అతడు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పని చేశాడు. అధికారులు ఇతడికి జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సు«దీర్‌.. బంగ్లాదేశీయుడికి నార్సింగిలో జని్మంచిన వ్యక్తిగా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్‌ యువకుడు ఇటీవల పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీసు వెరిఫికేషన్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్‌్కఫోర్స్‌ పోలీసులు సుదీర్‌తో పాటు సదరు బంగ్లాదేశీని అదుపులోకి తీసుకున్నారు.

మరింత లోతుగా విచారణ
మున్సిపల్‌ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న సు«దీర్‌ రెండు సంవత్సరాల క్రితం ఒకరికి అప్పటి కమిషనర్‌ సత్యబాబు డిజిటల్‌ సంతకంతో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు తెలిసింది. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నామని, అతన్ని అదుపులోకి తీసుకుంటున్నామని టాస్‌్కఫోర్స్‌ పోలీసులు తెలిపారు. అతను చేసిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తేవాలని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారికి చెప్పాను. అవసరమైతే మరింత లోతుగా విచారణ చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తాం.  
– టి. కృష్ణమోహన్‌రెడ్డి, కమిషనర్, నార్సింగి మున్సిపాలిటీ

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు