Breaking News

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

Published on Fri, 07/17/2026 - 16:32

ఎల్లారెడ్డిపేట:  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం హరిదాస్‌నగర్‌ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో కార్ల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ముప్పు తప్పింది. స్వల్ప ప్రమాదం అనంతరం యథావిధిగా బండి సంజయ్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది. 

అంతకుముందు సిరిసిల్లలో రూ. 105 కోట్లతో కార్గిల్‌ చెరువు పునరుద్ధరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ అభివృద్ధి కోసం నిధులిస్తే...జీతాలకు, కరెంట్ బిల్లులకు మళ్లిస్తారా?, ఆర్ధిక  సంఘం నిధులను దారి మళ్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ తీరు మార్చుకోవాలి. 

లేనిపక్షంలో కేంద్ర నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్లలోనే జమ చేసే అంశాన్ని పరిశీలిస్తాం. కేంద్రానికి లేఖ రాస్తా. గడువులోగా అమృత్ పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు. నిధులు వెనక్కువెళ్లే ప్రమాదం ఉంది. కేంద్ర నిధులతోనే తెలంగాణాలో అభివృద్ధి జరుగుతోంది’ అని స్పష్టం చేశారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)