Breaking News

బాలాపూర్‌ గణనాథుడి లడ్డూ అ‘ధర’హో

Published on Tue, 09/17/2024 - 07:30

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో గణేష్‌ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఖైరతాబాద్‌ వినాయకుడు. ఆ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్‌ వినాయకుడిని ప్రతిష్టించారు. ఎత్తైన గణేష్‌ విగ్రహం (70 అడుగులు) కూడా ఇదే. కాగా బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి మొదటిసారి 1994లో లడ్డూ వేలంపాట ప్రారంభించింది. తొలి వేలంపాటలో అదే ప్రాంతానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి రూ.450 లడ్డూ కైవసం చేసుకున్నారు. ఆయన వరుసగా మూడు సార్లు వేలంపాటలో పాల్గొన్నారు. ఈ లడ్డూను దక్కించుకున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో కాల క్రమంలో ప్రసాదానికి డిమాండ్‌ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌కు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలంపాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్‌ అంతా విస్తరించింది.

విగ్రహ సంస్కృతి ఇలా.. 
ఖైరతాబాద్‌ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతా విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్‌లో చిన్న, పెద్ద కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. ఇదిలా ఉంటే రెండు మూడేళ్ల క్రితం వరకూ బాలాపూర్‌ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. 2023లో బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సన్‌సిటీ రిచ్‌మండ్‌ విల్లాలోని గణనాథుడి చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదం బాలాపూర్‌ లడ్డూ రికార్డును బ్రేక్‌ చేసింది. ఏకంగా రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిత్యం రికార్డుల్లో నిలిచే బాలాపూర్‌ లడ్డూ మాత్రం గతేడాది రూ.27 లక్షలు పలికింది. ఈ యేడాదికి సంబంధించి మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే వేలం పాటలో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాల్సిందే.  

బాలాపూర్ లడ్డు వేలం పాట ఫుల్ వీడియో

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)