Breaking News

మరో ఘోరం.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను..!

Published on Sat, 07/05/2025 - 15:07

పాత పరిచయాలు, వివాహేతర సంబంధాలతో భర్తలను కడతేరుస్తున్న భార్యల ఉదంతాలు సోషల్‌ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండడం చూస్తున్నదే. పెళ్లై నెల తిరగకుండానే నవవధువులు సైతం ఈ జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

క్రైమ్‌: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆపై అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది దొరికిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ప్రయత్నించగా.. బంధువుల జోక్యంతో ఈ వ్యవహారం బయటపడింది. 

బాచుపల్లిలో నివాసం ఉంటున్న అంజిలప్ప ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని భార్య రాధ కన్నీరు మున్నీరు అయ్యింది. ఆపై స్వగ్రామం నారాయణపేటకు మృతదేహాన్ని తీసుకెళ్లింది. అయితే గొంతుపై  ఉన్న మరకలను చూసి బంధువులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆమెను గట్టిగా విచారించగా.. ఆమె అసలు విషయం చెప్పింది. 

గత కొంతకాలంగా రాధ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే అలాంటివి వద్దని, అతనితో ఫోన్‌ మాట్లాడొద్దని భర్త ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న రాధ.. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతును నులిమి హత్య చేసింది. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే హత్య చేసినట్లు రాధ అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)