Breaking News

రెండో భర్తతో కలిసి మొదటి భర్తను హత్య చేసిన భార్య

Published on Mon, 08/25/2025 - 13:34

రంగారెడ్డి జిల్లా: అజీజ్‌నగర్‌ డెయిరీ ఫామ్‌లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్‌లో పనిచేయడానికి వచి్చన మహిళ తన మొదటి భర్తతో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న సామ రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌లో పని చేసే రాజేశ్‌కుమార్‌(24) శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. నిందితులు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని పారిపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

నెల రోజుల క్రితమే.. 
అజీజ్‌నగర్‌లోని రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌లో పనిచేసేందుకు బిహార్‌కు చెందిన ఏజెంట్‌ పవన్‌ ద్వారా నెల రోజుల క్రితం రాజేశ్‌కుమార్, పూనం దేవి దంపతులు వచ్చారు. అయితే తన మొదటి భర్త మహేశ్‌సాని అలియాస్‌ గుడ్డును వదిలేసిన పూనందేవి.. రాజేశ్‌కుమార్‌ను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాజేశ్‌కుమార్, పూనందేవి అజీజ్‌నగర్‌లోని డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల రాజేశ్‌కుమార్‌ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని పూనందేవి తన మొదటి భర్త మహేశ్‌సానీకి ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో ఈనెల 21న మహేశ్‌సాని అజీజ్‌నగర్‌ వచ్చాడు. అతను తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి రాజేశ్‌కుమార్‌ను హత్య చేసి, పారిపోయారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)