Breaking News

బైపాస్‌ సర్జరీ తర్వాత నాణ్యమైన జీవితాన్ని గడపాలి: డాక్టర్‌ తిరుపతిరెడ్డి

Published on Thu, 11/14/2024 - 18:34

సాక్షి, హైదరాబాద్‌: గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే మరింత ఆరోగ్యంగా జీవించగలుగుతారని అమీర్‌పేట్‌లోని వెల్‌నెస్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం ఆస్పత్రిలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న రోగులకు వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టంట్‌తో పాటు బైపాస్‌ సర్జరీ చేసుకున్న వారు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా శారీరక వ్యాయమంతో పాటు ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో తాము తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 516 మందికి విజయవంతంగా బైపాస్‌ సర్జరీలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

రోగులకు ఖచ్చితంగా తగు మందులు వాడతంతో పాటు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గుండె సమస్య వచ్చిందనగానే కంగారు పడాల్సిన పని లేదని ఇప్పుడు అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెరిగాయని నేటి రోజుల్లో బైపాస్‌ సర్జరీ అంటే సర్వసాధారణం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి సుమన్‌ గౌడ్, వివేక్‌రెడ్డి, సీటీవీఎస్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీనివాస్, డాక్టర్‌ రమేష్‌బాబు, డాక్టర్‌ శతి, డాక్టర్‌ కార్తీక్, డాక్టర్‌ రంజిత, ఆస్పత్రి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)