Breaking News

సార్‌.. గిరాకీల్లేవ్‌!

Published on Mon, 03/25/2024 - 05:08

కరీంనగర్‌ టౌన్‌: ‘సార్‌ మూడు నెలలుగా గిరాకీల్లేవు. ఫైనాన్స్‌ తెచ్చి ఆటో నడుపుతున్నాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. గిరాకీ అంతంత మాత్రమే వస్తోంది. బడి పిల్లలను తీసుకెళ్తుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులొస్తున్నాయి. ఇక ఆ గిరాకీ కూడా ఉండదు. అప్పుల బాధ దేవుడెరుగు.. ఎట్లా బతకాలో అర్థం అయిత లేదు’అంటూ కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఎదుట కరీంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మొర పెట్టుకున్నారు. బండి సంజయ్‌ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు.

వారితో కలసి చాయ్‌ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్‌ చెల్లించే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని, ఇల్లు గడవడం కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బండి మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)