Breaking News

మార్పు కోసం.. ఆటో డ్రైవర్‌ ఆలోచన..

Published on Mon, 11/04/2024 - 08:30

సాక్షి, హైదరాబాద్‌: ఆయనో ఆటో డ్రైవర్‌.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగుల జీవితం.. ఎంతో కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లవు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రతిక్షణం సమాజం గురించే.. సమాజంలో ఉన్న సమస్యలు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణులపై అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. 

అందుకే యువతలో, సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఓ ఆటోడ్రైవర్‌.. తాను ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు. 

తన పరిధిలో ఏం చేయగలనో ఆలోచించాడు. కూడళ్లు, విద్యుత్‌ స్తంభాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం మారాలి.. మార్పు రావాలి.. అంటూ కొటేషన్స్‌ రాయడం ప్రారంభించారు. ఆయన పేరు దాడే శ్రీనివాస్‌.. అంబర్‌పేటకు చెందిన శ్రీనివాస్‌.. రెండున్నరేళ్లకు పైగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

రోజుకో కొటేషన్‌..
వివేకానంద సూక్తులు, వాక్యాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు 45 ఏళ్ల శ్రీనివాస్‌. ఈయనకు దేశ భక్తి కూడా ఎక్కువే. 
తన ఆటోలో ప్రయాణించే వారు తమ సమస్యలు చెప్పుకొంటుంటే ఎంతో బాధ అనిపించేదని, వీటన్నింటికీ కారణం సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులే కారణమని పేర్కొంటున్నాడు. ఇక, తల్లిదండ్రులను ఆస్తుల కోసం హింసించడం.. పెద్ద వారిపై గౌరవం లేకుండా ఉండటం వంటివి ఎన్నో ఉదంతాలు చూసి ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇక, యువత చెడు అలవాట్లకు బానిసై విలువలు లేని జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారిలో చిన్న మార్పు అయినా వస్తుందనే నమ్మకంతో ఇలా కొటేషన్లు రాస్తున్నానని చెప్పాడు. అలాగే తన ఆటోపై కూడా ప్రతి రోజూ కొత్త కొటేషన్లు రాస్తుంటానని వివరించాడు.

చిన్నతనంలోనే నగరానికి..  
షాద్‌నగర్‌ కుర్వగూడకు చెందిన శ్రీనివాస్‌ చిన్నతనంలోనే నగరానికి వలస వచ్చాడు. ఇంటరీ్మడియెట్‌లోనే చదువు ఆపేసిన శ్రీనివాస్‌.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని కూడా చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో నిలపాలనే ఉద్దేశంతో ఇంట్లో చిన్న బోర్డు ఏర్పాటు చేసి, దానిపై మంచి సూక్తులు రాసేవాడట. దీంతో వారు కూడా పెద్ద చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా, సహనంతో ప్రతి ఒక్కరూ జీవిస్తే సమాజంలో ఉన్న అనేక సమస్యలు రూపుమాపుతాయనేది తన నమ్మకమని చెబుతున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)