Breaking News

ట్రాఫిక్‌ హోంగార్డుపై ఆటో వాలా దాడి

Published on Mon, 07/15/2024 - 08:26

బంజారాహిల్స్‌: రాంగ్‌రూట్‌లో వస్తున్నావని ప్రశ్నించిన ట్రాఫిక్‌ హోంగార్డుపై ఆటోవాలా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. హోంగార్డును ఉరికించి తీవ్రంగా కొడుతూ బండరాయితో హత్య చేసేందుకు యతి్నంచిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ముత్యాల మెహర్‌ రాకేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ హోంగార్డు జయప్రకాష్‌ కృష్ణానగర్‌ ఇందిరానగర్‌ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు. 

ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ ఎండీ ఒమర్‌ షరీఫ్‌ ఇందిరానగర్‌ గడ్డ నుంచి రాంగ్‌రూట్‌లో కృష్ణానగర్‌ వైపు వస్తున్నాడు. ఇదేం పద్ధతి అని, రాంగ్‌రూట్‌లో ఎందుకు వస్తున్నావని హోంగార్డు ప్రశ్నించాడు. నన్నే ఆపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆటోడ్రైవర్‌ షరీఫ్‌.. హోంగార్డుపై విచక్షణారహితంగా పిడిగుద్దులతో గాయపర్చాడు. నిందితుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయతి్నంచిన హోంగార్డును వెంబడించి చితకబాదాడు. 

అందరూ చూస్తుండగానే అక్కడ ఉన్న బండరాయిని ఎత్తుకుని హోంగార్డును హత్య చేసేందుకు యత్నించగా బాధితుడు త్రుటిలో తప్పించుకుని నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంటల వ్యవధిలోనే పరారీలో ఉన్న ఆటోడ్రైవర్‌ను పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 132, 121, 125 (ఏ), 126 (2), 119, ఎంవీయాక్ట్‌ 177 కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)