Breaking News

హైదరాబాద్‌లో ఇష్టారాజ్యంగా ఆటో, క్యాబ్‌ చార్జీల పెంపు!

Published on Mon, 07/21/2025 - 08:25

సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి  ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్‌  ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను  ఆశ్రయించాడు. సాధారణంగా అయితే క్షణాల్లో బుక్‌ అయిపోయే  క్యాబ్‌లకు  అనూహ్యంగా డిమాండ్‌ నెలకొంది. చివరకు పావుగంట తర్వాత ఓ అగ్రిగేటర్‌ సంస్థకు చెందిన క్యాబ్‌ బుక్‌ అయింది. ఆన్‌లైన్‌ యాప్‌లో కనిపించిన చార్జీలు చూసి అతడు బెంబేలెత్తాడు. సాధారణంగా తార్నాక నుంచి తిరుమలగిరికి రూ.250 లోపే ఉంటుంది. 

కానీ ఆదివారం సాయంత్రం ఏకంగా రూ.530 వరకు పెరిగింది. మరో గత్యంతరం లేక  ఎక్కువ చార్జీలు చెల్లించేందుకు సిద్ధపడి క్యాబ్‌ ఎక్కేశాడు. ఇది కేవలం శ్రీనివాస్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో  ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు క్యాబ్‌ అగ్రిగేటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆటోలు, క్యాబ్‌ల నిర్వహణలో స్లాక్‌ (రద్దీ లేని), పీక్‌  (రద్దీ ఉన్న)  సమయాలుగా ఎలాంటి విభజన లేకపోయినప్పటికీ అడ్డగోలుగా చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడం గమనార్హం.  

ఆన్‌లైన్‌లోనే బేరసారాలు..  
కొన్ని అగ్రిగేటర్‌ సంస్థలు ఆన్‌లైన్‌లోనే బేరసారాలకు దిగుతున్నాయి. ఉప్పల్‌కు చెందిన  ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్‌ వరకు వెళ్లేందుకు ఒక ఆటోను బుక్‌ చేసుకున్నాడు. మొదట రూ.150 వరకు చార్జీలు కనిపించాయి. సరేననుకొని  ప్రయాణానికి  సిద్ధమయ్యాడు. కానీ.. ఎంపిక చేసుకున్న చార్జీలకు ఆటోడ్రైవర్‌ సుముఖంగా లేడంటూ  ఐదు నిమిషాల తర్వాత మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించింది. అంతే కాదు. అదనపు చార్జీలు చెల్లిస్తే ఆటో లభించవచ్చని సంకేతం, దాంతో మరో రూ.20 అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. అయినా ఆటో రాలేదు. అలా చివరకు రూ.50 ఎక్కువ చెల్లించేందుకు  అంగీకరించిన తర్వాత క్షణాల్లో ఆటో వచి్చంది. దీంతో సదరు ప్రయాణికుడు బిత్తరపోయాడు. ఇలా కొన్ని ఆటో, క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు ఆన్‌లైన్‌లోనే బేరసారాలకు దిగుతున్నాయి. మొదట తక్కువ చార్జీలను ప్రదర్శించి ఆ తర్వాత ప్రయాణికుడి  అత్యవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు బేరసారాలకు దిగుతున్నాయి.  

 కొన్ని అగ్రిగేటర్‌ సంస్థలకు చెందిన యాప్‌లలో ఈ ఆప్షన్‌ కొత్తగా కనిపించడం గమనార్హం. మరోవైపు నగరంలోని  వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రం పలు సంస్థలకు చెందిన క్యాబ్‌లు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. క్యాబ్‌ బుక్‌ అయిన తర్వాత  ఆకస్మికంగా రద్దవుతున్నాయి. ఎంపిక చేసుకున్న క్యాబ్‌ కోసం చాలా సేపటి వరకు పడిగాపులు కాసి చివరకు ప్రయాణికులే తమకు తాముగా రద్దు చేసుకొనేవిధంగా కొందరు  డ్రైవర్లు  వ్యవహరిస్తున్నారు. 

మెట్రోల్లో పెరిగిన రద్దీ..  
నగరంలోని  వివిధ మార్గాల్లో  ఆదివారం మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. బోనాల సందర్భంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగించారు. దీంతో నాగోల్‌–రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ కారిడార్‌లలో  సాయంత్రం పలు మెట్రో స్టేషన్‌లలో సందడి నెలకొంది, సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ తగ్గుముఖం పడుతుంది. కానీ ఆదివారం బోనాల వేడుకలు, వర్షం కారణంగా  ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు.

 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)