Breaking News

గన్‌మెన్‌ కావాలని..

Published on Fri, 03/01/2024 - 12:09

ఉప్పల్‌: బీజేపీ నేతపై హత్యాయత్నం బూటకమని పోలీసులు తేల్చారు. తనకు రాజకీయ నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ప్రాణహాని ఉందని  పోలీసులను నమ్మించే ప్రయత్నంలో  తనపై తానే హత్యాయత్నం చేయించుకున్న రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. బోడుప్పల్‌ ప్రాంతానికి చెందిన  యల్లగోని భాస్కర్‌ గౌడ్, సినీ నిర్మాతగా, రియల్‌ వ్యాపారిగా పని చేసేవాడు. ఈ నెల 24న అతను తనపై హత్యాయత్నం జరిగిందని  రక్త గాయాలతో ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో పలు అసక్తికరమైన  అంశాలు  గుర్తించారు. 

సెటిల్‌మెంట్లు..రియల్‌ దందాలు 
భాస్కర్‌ గౌడ్‌ పలు సినిమాలకు నిర్మాత వ్యవహరించాడు. బీజేపీ రాష్ట్ర స్వచ్చ్‌ భారత్‌ అభియాన్‌ కనీ్వనర్‌గా, జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. బోడుప్పల్‌లో ఆఫీసు ఏర్పాటు చేసిన అతను భూ తగాదాలకు సంబంధించిన సెటిల్‌ మెంట్‌లు చేస్తుంటాడు.  ఈ క్రమంలో అతడిపై ఉప్పల్, నాచారం, కీసర తదితర పోలీస్‌ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి, మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ షీట్‌ ఉంది.  

పలుకుబడి కోసం పథకం.. 
ఈ నేపథ్యంలో ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు గన్‌మెన్‌న్‌ను నియమించుకోవాలని భావింన భాస్కర్‌ గౌడ్‌ తన స్నేహితుడు శివ కిషోర్‌ గౌడ్‌తో కలిసి పథకం రూపొందించాడు. హత్యాయత్నం జరిగితే కాని గన్‌మెన్‌లను ఇవ్వరని తెలియడంతో శివకిషోర్‌ తన స్నేహితుడు యదగిరితో కలిసి ఈ నెల 22 న  నాగోల్‌లోని అమరావతి బార్‌ వద్ద పథకం రంచారు. యాదగిరి స్నేహితులు కొండా అరుణ్,సృజన్‌ రెడ్డి, ఆకుల ప్రశాంత్, మిరపకాయల  సంతోష్‌ రెడ్డి, మహేష్‌ తదితరులు భాస్కర్‌ గౌడ్‌పై  ఫేక్‌ హత్యాయత్నం  చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ర. 2.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా ర. 50,000 ఇచ్చారు.

24న ఉప్పల్‌ ఏషియన్‌ థియేటర్‌ వైపు నుంచి భాస్కర్‌ గౌడ్‌ కారులో డ్రైవర్‌తో కలిసి ఉప్పల్‌ భగాయత్‌లోకి రాగానే వనం టీ స్టాల్‌ వద్ద ఉన్న శివకుమార్‌ స్నేహితులు డ్రైవర్‌పై, భాస్కర్‌ గౌడ్‌పై కత్తితో దాడి చేసి పారి పోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యాయత్నం బూటకమని తేల్చారు. పోలీసులను తప్పుదోవ  పట్టింనందుకుగాను పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిరపకాయల సంతోష్‌  రెడ్డి, మహేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండీ హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్‌లు, ర. 2 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సవవేశంలో ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌ రెడ్డి ,ఎస్‌ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)