Breaking News

16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై వేటు

Published on Wed, 08/07/2024 - 06:16

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌లు) కార్యదర్శులపై.. రాష్ట్ర సహకార శాఖ చర్యలు చేపడుతోంది. పంట రుణాల మంజూరు, వాటి రెన్యువల్‌కు సంబంధించిన సమాచారాన్ని అసంబద్ధంగా పంపారనే కారణంతో 16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. 

ఇందులో 11 పీఏసీఎస్‌లు వాణిజ్య బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనసాగు తుండగా, మిగతా 5 పీఏసీఎస్‌లు డీసీసీబీ ఆర్థిక సాయంతో కొనసాగు తున్నాయి. మరో 13 పీఏసీఎస్‌ల కార్యదర్శులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సహకార శాఖ డైరెక్టరేట్‌.. వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. అదేవిధంగా మరో 92 పీఏసీఎస్‌లకు సంబంధించి కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. తక్షణమే స్పందించాలని ఆదేశించింది. 

బకాయిలు, వడ్డీ లెక్కల్లో తప్పులు!
రాష్ట్ర వ్యాప్తంగా 105 పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. పంట రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ మధ్యలో రుణాలు పొందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే 16 పీఏసీఎస్‌లు నిర్ణీత వ్యవధి మధ్యలో లేని వారిని కూడా పంట రుణమాఫీకి అర్హులుగా గుర్తించి పంపినట్లు వెల్లడైంది. పలు పీఏసీఎస్‌ల్లో రైతుల రుణ బకాయిలు, వడ్డీ లెక్కించడంలో పెద్ద ఎత్తున పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు. 

ఈ నేపథ్యంలోనే సహకార శాఖ ఉన్నతాధికారులు ఆయా పీఏసీఎస్‌ల కార్యదర్శుల సంజాయిషీ కోరారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా సహకార అధికారులను సహకార శాఖ డైరెక్టరేట్‌ ఆదేశించింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలని, పీఏసీఎస్‌ల కార్యదర్శులను సహకార శాఖ రిజిస్ట్రార్‌ ఆదేశించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)