పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం

Published on Sun, 08/17/2025 - 05:41

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో పార్లమెంటు భవనం పరిసరాలు ప్రత్యేకంగా ఉన్న తరహాలోనే తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని కూడా రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉభయసభలున్న ప్రాంగణం యావత్తు కొంత గందరగోళంగా ఉంది. వారసత్వ భవనం అయినప్పటికీ, ప్రధాన భవనానికి చేరువలో ఇతర భవనాలుండటంతో ఆ భవన ప్రత్యేకతకు కొంత భంగంవాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది. 

సభ జరిగే సమయంలో వాహనాలకు సరైన పార్కింగ్‌ వసతి లేకపోవటంతో ప్రధాన భవనం చుట్టూరా నిలుపుతున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనం అయినప్పటికీ, దాని ప్రత్యేకతను ఇనుమడింపజేసేలా పచ్చిక బయళ్లు లేకపోవటం వెలితిగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాన భవనానికి అతి చేరువలో ఉన్న ఇతర భవనాలను తొలగించి.. కొంచెం దూరంగా, క్రమపద్ధతిలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

శాసనసభ్యులు, మండలి సభ్యులు, వీఐపీలకు ఆ భవనంలో చాలినన్ని వసతులు లేవని, అందుకు ప్రత్యేకంగా మరో భవనం నిర్మించి వసతులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రోడ్లు, భవనాల శాఖ ఓ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది.  

ఉద్యానవన శాఖ స్థలాన్ని సేకరించి.. 
శాసన మండలి కూడా శాసనసభ ఉన్న ప్రధాన భవనంలోకే మారనుంది. ఇప్పటికే పాత అసెంబ్లీ హాల్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ప్రస్తుతం జూబ్లీహాలు వెనకవైపు కొనసాగుతున్న మండలి ప్రాంగణాన్ని ఖాళీ చేయనున్నారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తాన్ని రీమోడలింగ్‌ చేయబోతున్నారు. ఇందుకోసం ఉద్యానవన విభాగం ఆదీనంలోని స్థలాలను సేకరించి దానికి మరోచోట ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించారు. 

అలా సేకరించిన నర్సరీ, ఉద్యానవన స్థలాలను కొత్త నిర్మాణాలకు వాడబోతున్నారు. జూబ్లీహాలు భవనానికి కూడా వారసత్వ హోదా ఉండటంతో దానిని తొలగించే వీలులేదు. దీంతో ఆ భవనాన్ని రీమోడలింగ్‌ చేయబోతున్నారు. దాని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కూడా వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా భారీ పార్కింగ్‌ యార్డును రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 

సాధారణ పార్కింగ్‌ స్థలం వాహనాలకు సరిపోని పక్షంలో ప్రత్యేకంగా పార్కింగ్‌ టవర్‌ను నిర్మించే యోచనలో ఉన్నారు. మొత్తంమీద వాహనాలను ప్రధాన భవనం ఛాయల్లో పార్క్‌ చేయకుండా చేస్తారు. ఇక పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉన్న భవనాలు తొలగించి ఆ ప్రాంతాన్ని లాన్‌గా మార్చబోతున్నారు. ముందు వైపు, ఆ చుట్టు పక్కల ఎలాంటి ఇతర నిర్మాణాలు లేకుండా క్రమబద్ధం చేస్తారు.  

వాటికీ రీమోడలింగ్‌.. 
ఇక పబ్లిక్‌ గార్డెన్‌లో ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, జవహర్‌ బాలభవన్, హెల్త్‌ మ్యూజియంలు వినియోగంలో లేవు. వాటిని కూడా రీమోడలింగ్‌ చేయటం ద్వారా ఎలాంటి అవసరాలకు వినియోగించవచ్చనే విషయంలో ప్లాన్‌ చేస్తున్నారు. వీఐపీలకు, సందర్శకులకు వేర్వేరు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయబోతున్నారు. 

పార్లమెంట్‌లో ఉన్న సెంట్రల్‌ హాల్‌ మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి హాల్‌ నిర్మాణం, అక్కడ శాసన సభ్యులు కలసి కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా ఏర్పాట్లు, సమావేశాల నిర్వహణకు వినియోగించుకునేలా నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో ముఖ్యమంత్రి ఆమోదించే ప్రణాళిక ప్రకారం త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)