Breaking News

సరిహద్దులో పేలనున్నమరో సిటీ తుపాకీ

Published on Tue, 08/19/2025 - 01:54

సాక్షి, హైదరాబాద్‌: భారత సరిహద్దుల్లో పహారా కాసే జవాన్ల చేతికి మరో ‘సిటీ తుపాకీ’అందనుంది. బాలానగర్‌ కేంద్రంగా పని చేసే లోకేశ్‌ మెషీన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఇప్పటికే ‘అస్మి’పేరుతో ఓ సబ్‌ మెషీన్‌ గన్‌ (ఎస్‌ఎంజీ) రూపొందించి ఆర్మికి అందించింది. తాజాగా మీడియం మెషీన్‌ గన్‌ (ఎంఎంజీ)ను తయారు చేస్తోంది. పుణెలోని రక్షణ అభివృద్ధి, పరిశోధక సంస్థ (డీఆర్డీఓ)లో అంతర్భాగమైన అర్మామెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిషిమెంట్‌ ఈ గన్‌ను డిజైన్‌ చేయగా... తయారీకి సంబంధించి ఆర్మీ నుంచి రూ.17.7 కోట్ల ఆర్డర్‌ లోకేశ్‌ మెషీన్స్‌కు దక్కింది.

ఈ సంస్థ ఇజ్రాయెల్, జర్మనీ ఆయుధ కర్మాగారాలకు దీటుగా ‘అస్మి’ని ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది. ఈ తుపాకీని భద్రతా బలగాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగిస్తున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ అస్మి అనువుగా ఉంది. తాజాగా 7.62 = 51 మి.మీ. క్యాలిబర్‌తో ఉండే ఈ ఎంఎంజీ కూడా నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారవుతోంది. ఈ ఎంఎంజీలో క్విక్‌ ఛేంజ్‌ బ్యారల్‌ సిస్టం, త్రీ–పొజిషన్‌ గ్యాస్‌ రెగ్యులేటర్‌ వంటి ఆధునిక హంగులున్నాయి.

తుపాకీ సమర్థమంతంగా పని చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తున్న ఎంఎంజీల కంటే ఈ తుపాకీ 25 శాతం తక్కువ బరువు ఉంటుంది. 1800 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఛేదించగలదు. 250 తూటాల బెల్ట్‌ కెపాసిటీతో పని చేస్తుంది. రెండు బెల్ట్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మైనస్‌ 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలోనూ నిరాఘంటంగా సేవలు అందిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)