Breaking News

పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ

Published on Sun, 10/19/2025 - 08:00

సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), శివార్ల శేఖర్‌ ప్రేమించుకుని గతేడాది కులాంతర వివాహం చేసుకున్నారు. శేఖర్‌ తండ్రి సత్తయ్య అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. భార్య శ్రావణి ఉరఫ్‌ రాణితో కలిసి శేఖర్‌ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. శనివారం శేఖర్‌ తన అత్తామామలు చెన్నయ్య, అనూషతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని అడవికి వెళ్లాడు. గర్భిణి అయిన శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉంది. సత్తయ్య గొడ్డలితో ఇంట్లోకి చొరబడి శ్రావణిపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో బయటకు పరుగులు తీసినా వెంబడించి దాడిచేశాడు. దీంతో  ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)