పోలీసులకు ‘ఆంబిస్‌’ అస్త్రం!

Published on Fri, 11/08/2024 - 05:40

సాక్షి, హైదరాబాద్‌: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్‌ (ఆటోమేటెడ్‌ మల్టీమోడల్‌ బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్‌ స్పెషల్‌ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌) శిక్షణ పూర్తి చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్‌ స్టేషన్లలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఆంబిస్‌ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్‌ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్‌వేర్లను సైతం అప్‌గ్రేడ్‌ చేసినట్టు చెప్పారు. ఆంబిస్‌ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్‌ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు.  

ఏమిటీ ఆంబిస్‌?  
నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇ­చ్చేందుకు తెలంగాణ ఫింగర్‌ ప్రింట్‌ బ్యూ­రో 2017 నుంచి ఆఫిస్‌ (ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధు­నీకరిస్తూ ఆంబిస్‌ (ఏఎంబీఐఎస్‌)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్‌ ప్రొ­సీ­జర్‌ ఐడెంటిఫికేషన్‌ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్‌ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్‌ ఇమేజెస్‌), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. 

ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్‌ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్‌ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్‌ పూర్తిగా ఆర్టిఫిషిల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్‌ నెట్వర్క్‌ ఆధారిత ఫింగర్‌ప్రింట్‌ ఆల్గారిథమ్స్‌ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. 

ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్‌ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్‌ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్‌ రికగ్నిషన్‌ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్‌ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్‌ నెట్వర్క్‌ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)