Breaking News

నర్మాలలో ఆర్మీ హెలికాప్టర్‌ ఆపరేషన్‌ సక్సెస్‌.. రైతులు సేఫ్‌

Published on Thu, 08/28/2025 - 12:58

సాక్షి, సిరిసిల్ల: గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్‌ రెస్య్కూ ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆర్మీ హెలికాప్టర్‌ సాయంతో నర్మాలలో మానేరువాగు మధ్యలో చిక్కుకున్న  ఐదుగురు రైతులను కాపాడారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, పశువులు మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకుని ఎత్తైన గడ్డ మీద ఉన్నారు.

ఈ క్రమంలో వీరికి డ్రోన్‌ ద్వారా అధికారులు ఆహారం అందించారు. రైతుల వద్దకు బోట్ల ద్వారా చేరుకోలేమని, హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. మానేరు వరదలో ఇప్పటికే నాగయ్య(50) గల్లంతయ్యాడు. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌.. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని తెలిపారు. బాధితులను కాపాడేందుకు వైమానికదళ హెలికాప్టర్‌ పంపాలని కోరారు. బండి సంజయ్‌ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నర్మాలకు ఆర్మీ హెలికాప్టర్‌ చేరుకుంది. 

మరోవైపు.. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ నర్మాలలో సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు అవసరమైతే మరిన్ని NDRF టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు