Breaking News

కొనసాగుతున్న యూరియా కష్టాలు

Published on Thu, 09/11/2025 - 04:30

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్‌ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్‌ ఎదుట ఆందోళన చేశారు. 

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్‌ పీఏసీఎస్‌ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.

యూరియా బారులు 
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం నెమ్మికల్‌లోని మన గ్రోమోర్‌ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులు లైన్‌లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.   – సాక్షి స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ సూర్యాపేట 

#

Tags : 1

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)