Breaking News

ఆర్టీసీ డ్రైవర్లు, శ్రామిక పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Published on Wed, 10/08/2025 - 04:13

సాక్షి, హైదరాబాద్‌: టీజీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల నియామకానికి బుధవారం (అక్టోబర్‌ 8 ) ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్‌లో (నిర్దిష్ట గ్రూప్‌ అంటే గ్రూప్‌– ఐ /గ్రూప్‌– ఐఐ / గ్రూప్‌– ఐఐఐ యొక్క ఉప–వర్గీకరణతో) ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్‌ను పొందలేకపోతే, వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చని సూచించారు. 

అయితే, ఆయా అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను సమర్పించాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని వెల్లడించారు. కాగా, టీజీఎస్‌ ఆర్టీసీలోని మొత్తం వెయ్యి డ్రైవర్‌ పోస్టులకు, 743 శ్రామిక్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్పీఆర్బీ సెప్టెంబర్‌ 17న నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇందులో డ్రైవర్‌పోస్టుకు పేస్కేల్‌ రూ.20,960 నుంచి రూ.60,080 కాగా, శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030గా ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వివరాల కోసం టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లో ఠీఠీఠీ.్టజpటb. జీnలో చూడాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)