Breaking News

మునిగే తండాలో ఇక ఉండలేం

Published on Wed, 09/04/2024 - 04:05

సాక్షి, మహబూబాబాద్‌: ‘సారూ.. శనివారం రాత్రి వచ్చిన వరదతో చెట్టుకొకరం.. పుట్టకొకరం అయినం. ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నం.. ఇట్టా మునిగే తండాలో ఉండలేం.. మాకు వేరేచోట ఇళ్లు కట్టించి ఇవ్వండి.. తండా అంతా అక్కడే ఉంటాం..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట మహ బూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండావాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం తండాకు వచి్చన సీఎం స్థానికులతో మాట్లాడారు.  

సీఎం: నీ పేరు ఏం పేరు...? 
తండావాసీ: నాపేరు మంగీలాల్‌ సార్‌..

సీఎం: ఏం జరిగింది? ఎక్కడివరకు నీళ్లు వచ్చాయి? (ఇల్లు చూపిస్తూ) 
మంగీలాల్‌: శనివారం రాత్రి అందాజ 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఏంది అని చూడగానే బయట అంతా కొండ మాదిరిగా నీళ్లతో ఉంది. నా భుజాల వరకు నీళ్లు వచ్చేశాయి. వెంటనే మేము పిల్లల్ని తీసుకుని పెద్ద బిల్డింగ్, ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం..ఇక ఇక్కడ ఉండలేం సార్‌.. మాకు వేరే ఇల్లు కట్టించండి. 

సీఎం: శీనన్నా (పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి) వీళ్లను చూడు. ఈ ఇల్లు మీరే కట్టుకున్నారా? (మళ్లీ మంగీలాల్‌ను ఉద్దేశించి) 
మంగీలాల్‌: లేదు సార్‌.. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కట్టుకున్నాం.  

సీఎం: ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. ఇక్కడే ఉంటారా.. వేరే చోటుకు వెళ్తారా? కలెక్టర్‌ గారూ అంతా చూడండి. తండా మొత్తం నమోదు చేసుకోండి. మంచి సైట్‌ చూడండి. ఇంట్లో ఏం తడిసినయి? ఏం ఇబ్బంది జరిగింది?  
మంగీలాల్‌ కొడుకు: సార్‌ నా పుస్తకాలు తడిసినయి.. ఈ ఇంట్లో ఉండలేము. మళ్లీ మునుగుతాం.. మాకు వేరే ఇల్లు కావాలి.  

మంగీలాల్‌: బియ్యం, బట్టలు అన్నీ తడిసినయ్‌ సార్‌ 
సీఎం: ఈమె తెలుసా? (సీతక్కను చూపిస్తూ) ఈమె నీకు కావాల్సిన పుస్తకాలు కొనిస్తుంది.. ఈయన తెలుసా? (ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ను చూపిస్తూ) ఈయన పెద్ద డాక్టర్‌. ఈయన మాదిరిగానే మంచిగా చదువుకోవాలి.. అధైర్య పడకండి.. అన్నీ చూసుకుంటాం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)