Breaking News

తెలంగాణలో ఏపీ టీడీపీ నేతల ఇసుక దందా

Published on Fri, 12/12/2025 - 16:31

సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణలోనూ ఏపీ టీడీపీ నేతల ఇసుక దందా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. లారీలు, టిప్పర్లలో  ఏపీ ఇసుక.. తెలంగాణ సరిహద్దు దాటుతోంది.

పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి వాడపల్లి చెక్ పోస్ట్ మీదుగా అక్రమ రవాణా సాగుతోంది. లారీలు, టిప్పర్లపై ఇసుక కనబడకుండా టార్పలిన్ కవర్లు కప్పి మరీ టీడీపీ ముఠాలు.. ఇసుకను రవాణా చేస్తున్నారు. సరిహద్దులో ఎలాంటి చెక్ పోస్టులు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక లారీలు సాక్షి టీవీ కెమెరాకు చిక్కాయి.

గత నెల(నవంబర్‌)లో ఏపీలోని కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రక్కిలంకలో ఉన్న ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు 200కు పైగా లారీల్లో ఇసుకను అక్రమార్కు­లు తరలించారు. ప్రక్కి­లంక ర్యాంపు నుంచి గోపాల­పురం, కొయ్య­లగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణలోని అశ్వారావు­పేటలోకి ప్రవేశించిన మూడు లారీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అడ్డుకని 105 టన్నుల ఇసుకను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

చింతలపూడి మీదుగా సత్తుపల్లికి తరలించి అక్కడి నుంచి ఖమ్మం, మహబూబ్‌నగర్, గద్వాల్‌ జిల్లాలో విక్రయిస్తున్నా­రు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 23న దమ్మపేట మండలం నాగుపల్లిలో ఇదే తరహాలో వాహనాలను సీజ్‌ చేసి కేసు­లు నమోదు చేశారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)