300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
మహిళా ఉద్యోగి ఫొటోలు పోస్టు చేసిన ఏఓ అరెస్ట్
Published on Tue, 06/02/2026 - 09:26
జనగామ: జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో పనిచేస్తు న్న ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను అనుమతి లేకుండా తీసి, నకిలీ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో అదే కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయ్‌రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్ పంపించినట్టు సీఐ సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు.
సీఐ మాట్లాడుతూ విజయ్‌రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆమె ఫొటోలను పోస్టు చేసి, అవమానకరమైన కామెంట్లతో గౌరవానికి భంగం కలిగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. మహిళల పై కార్యాలయాల్లో జరిగే లైంగిక వేధింపులను నిరోధించే పోష్ చట్టం–2013 ప్రకా రం ఇది శిక్షార్హమైన నేరమని తెలిపారు. దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినట్టు పేర్కొన్నారు.
Tags : 1