Breaking News

బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Published on Wed, 08/09/2023 - 00:58

భైంసా, నారాయణఖేడ్‌: బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ–1 చదువుతున్న విద్యార్థి జాదవ్‌ బబ్లూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నాగాపూర్‌ గ్రామానికి చెందిన బబ్లూ గతనెల 31న బాసర ట్రిపుల్‌ఐటీలో చేరాడు. నాలుగు రోజులుగా నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సోమవారం నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.

పీయూసీ–1లో అడ్మిషన్‌ పొందిన జాదవ్‌ బబ్లూ తరగతులకు హాజరైన రెండోరోజే హాస్టల్‌ బ్లాక్‌లో ఉరేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో నిర్మల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ తెలిపారు. కాగా ట్రిపుల్‌ఐటీలో రెండు నెలల క్రితం జూన్‌ 14న సిద్దిపేట జిల్లాకు చెందిన బోర లిఖిత అనే విద్యారి్థని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగిన కొద్దిసేపటికే  
‘‘నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగాడు.. కొద్ది సేపటికే మీ బిడ్డ చనిపోయాడని కళాశాల నుంచి పిడుగులాంటి వార్త విని గుండె పగిలినంత పని అయింది’అని జాదవ్‌ బబ్లూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నా బిడ్డ చక్కగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతాడనుకుంటే గర్భశోకం మిగిల్చాడని భోరుమని విలపించారు. ఇలా ఎందుకు చేశాడో తెలియదని విలపించారు.

కాంగ్రెస్‌ ఆందోళన.. 
ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి బబ్లూ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు నిర్మల్‌ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లేందుకు యతి్నంచారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికే బాసరలో 20మంది విద్యార్థులు చనిపోయారనీ, ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే పాలకులు స్పందిస్తారని కాంగ్రెస్‌ నియోజకవర్గ నేత కూచాడి శ్రీహరిరావు ప్రశ్నించారు.

విద్యార్థుల ప్రాణాలు పోతుంటే సీఎం కేసీఆర్‌ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాగా ట్రిపుల్‌ ఐటీ అధికారులు బబ్లూ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌ రావాలని నినదించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)