Breaking News

యాదగిరిగుట్టలో అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

Published on Mon, 12/01/2025 - 08:46

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధ్యాత్మిక వాడలో అధునాత హంగులతో వేగేశ్న ఫౌండేషన్‌ సహకారంతో నిర్మించిన శ్రీ శాంతా రుష్య శృంగ అన్నప్రసాద కేంద్రాన్ని ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో కలిసి ఆదివారం వేగేశ్న ఫౌండేషన్‌ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేగేశ్న ఫౌండేషన్‌ అధినేత అనంతకోటి రాజు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ఆయా ఆలయాలకు వచ్చే భక్తులకు తమ ఫౌండేషన్‌ ద్వారా అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు. 

గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమలలో అన్నప్రసాద కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన గత, ప్రస్తుత ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి మాట్లాడుతూ.. 5 ఏళ్ల క్రితం వేగేశ్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన అన్నప్రసాద కేంద్రాన్ని రూ.21కోట్లతో అద్భుతంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు అన్నప్రసాద కేంద్రంలో పులిహోర, సిర, చిన్న లడ్డూ, మిర్చి, పన్నీరు కూర్మ, ఆలు కర్రీ, పెరుగు, పప్పుచారు, టమాట పచ్చడి, పాపడం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్‌ నిర్వాహకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)