Breaking News

హైద‌రాబాద్‌లో ఏపీ మాజీ ఎంపీ హ‌ల్‌చ‌ల్‌

Published on Wed, 08/06/2025 - 09:04

హైదరబాద్  : ‘నేను తాజా మాజీ ఎంపీని. నా కారు ఆపి సైరన్‌ తొలగిస్తారా.. నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని.. నీ ప్రాంతం కాకున్నా సైరన్‌ తొలగిస్తారా.. ఇక్కడ ఏ మంత్రికి ఫోన్‌ చేయమంటారు..?’ అంటూ ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ బంజారాహిల్స్‌ (Banjara Hills) ట్రాఫిక్‌ పోలీసులపై రుసరుసలాడారు. 

మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిప్రకాష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి తదితరులు సైరన్లు, సైలెన్సర్లపై స్పెషల్‌ డ్రైవ్‌ (Special Drive) చేపట్టారు. అదే సమయంలో ఓ కారును ఆపగా, అందులో కూర్చొన్న వ్యక్తి తాను మాజీ ఎంపీనని, తాము సైరన్లు పెట్టుకోవచ్చని, ఏపీలో కాకుండా ఇక్కడ తొలగించడానికి మీకు ఏమి హక్కు ఉందంటూ నిలదీశాడు. 

ఎంపీలైనా సరే సైరన్లు పెట్టుకోవద్దు సార్‌ అంటూ పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా ఇక్కడ మంత్రులంతా తనకు తెలుసునని, ఎవరికి ఫోన్‌ చేయమంటావంటూ ఆగ్రహించారు. అయితే స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా మోటారు వాహన చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఏర్పాటుచేసిన సైరన్లను తొలగిస్తున్నామని, ఇది కూడా తొలగించాల్సిందేనని సూచిస్తూ ఆయన కారులో ఏర్పాటు చేసిన సైరన్‌ను పోలీసులు తొలగించారు.

చ‌ద‌వండి: నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ..    

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)