Breaking News

ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌

Published on Fri, 11/21/2025 - 01:55

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత మేర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఉదయం ‘అనలాగ్‌ ఏఐ’సీఈఓ అలెక్స్‌ కిప్‌మన్‌ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ రద్దీ, నగర ప్రాంతాల్లో వరదలు, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరిష్కార మార్గాలపై చర్చించారు.

‘ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌’ఆధారంగా రియల్‌ టైమ్‌ సెన్సార్‌ నెట్‌వర్క్, స్మార్ట్‌ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఎనిమిదివారాల పాటు ‘ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌’ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయా లని నిర్ణయించారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా సీసీ టీవీ వ్యవస్థను ‘రియ ల్‌ టైమ్‌ సిటీ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫారమ్‌’గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజాభద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేస్తారు.

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రాజెక్టును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఇది పూర్తయ్య–2047’లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా ‘ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌’అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కిప్‌మన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాల్సిందిగా కిప్‌మన్‌ను రేవంత్‌ ఆహ్వానించారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)