Breaking News

ముస్లిం రిజర్వేషన్లే రద్దు

Published on Mon, 05/06/2024 - 06:32

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ ఆసిఫాబాద్‌:  మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, మతపరమైన (ముస్లిం) రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో ఎవరూ రిజర్వేషన్లను తొలగించకుండా చూస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నుంచి ఆర్‌ఆర్‌ (రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి) టాక్స్‌ వసూలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రం, ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలి్పస్తామని నేను ఇటీవల ఓ సభలో చెప్పాను. ఆ వీడియోను ఎడిట్‌ చేసి మోదీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నట్టుగా ప్రజల్లో దు్రష్పచారం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ రిజర్వేషన్లు తొలగించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10శాతం రిజర్వేషన్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు కలి్పంచింది. మోదీ ఆరి్టకల్‌ 370ను రద్దు చేశారు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేశారు. రామమందిర నిర్మాణం చేశారు. 

ఆర్టికల్‌ 370ను రద్దుచేస్తే కశీ్మర్‌లో రక్తపుటేరులు పారుతాయని రాహుల్‌గాంధీ అడ్డుపడే ప్రయత్నం చేశారు. అది చేసి ఐదేళ్లు గడిచిపోయాయి రక్తపుటేరులు కాదు.. కనీసం రాళ్ల దాడి చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే.. పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. 

వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌ పారీ్టలు సంతుïÙ్టకరణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్‌ఎస్, సీ అంటే కాంగ్రెస్‌.. ఈ మూడు పారీ్టలు ఓటుబ్యాంకు కోసం రామనవమి యాత్రకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాయి. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేంద్రంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. అయోధ్య సమస్యను పరిష్కరించలేదు. మోదీ ఐదేళ్లలో పరిష్కరించి, రామమందిర నిర్మాణం పూర్తి చేశారు. రామాలయ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానించినా.. ఒకవర్గం ఓట్ల కోసమే రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే అయోధ్యకు రాలేదు. 

ఇండియా కూటమికి నాయకత్వమేది? 
ఇప్పుడు ఎన్నికల్లో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఉన్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీ కావాలా? 23 ఏళ్లు సీఎం, పీఎంగా ఉన్నా ఒక్క అవినీతి మరకలేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. దీపావళి నాడు కూడా సెలవు లేకుండా దేశ సైనికులతో కలసి పండుగ జరుపుకునే మోదీ ఓవైపు ఉంటే.. నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టి, ఎండ పెరగగానే బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు చెక్కేసే రాహుల్‌ గాంధీ మరోవైపు ఉన్నారు.. ఎవరు కావాలి? ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు? అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ఉంటారని అంటున్నారు. అలాంటి ఇండియా కూటమి భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారి ఏదైనా వస్తే కాపాడగలదా? ఆ మోదీకే ఉంది. యావత్‌ భారతానికి ఉచితంగా, వేగంగా వ్యాక్సినేషన్‌ చేయించారు. ఆ ముందు చూపుతోనే మనమంతా బతికిపోయాం. 

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసింది 
తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. అన్నిరకాలుగా ఆదుకుంటోంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ మోదీ ప్రభుత్వమే సంపూర్ణంగా నిధులిచి్చంది. పసుపు బోర్డు ఇచి్చంది. 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, రూ.20వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌రోడ్డు, రూ.1,100 కోట్లతో ఎంఎంటీఎస్‌ మంజూరు చేశాం.

 పీఎంజీఎస్‌వై కింద రూ.6 వేల కోట్లు ఇచ్చాం. బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఏర్పాటు, హసన్‌–చర్లపల్లి ఎల్‌పీజీ గ్యాస్‌ పైప్‌లైన్, రూ.2 వేల కోట్లతో కృష్ణపట్నం–హైదరాబాద్‌ పెట్రోల్‌ పైప్‌లైన్, రూ.1,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫాక్టరీ పునఃప్రారంభం వంటి చేపట్టాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి నాలుగు వందే భారత్‌ రైళ్లు ప్రారంభించాం. అవినీతిమయ కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లతో మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు అందరూ ముందుకురావాలి. తెలంగాణలో 12 సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా మారుస్తాం..’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు..  షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం.. 
పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తాం. ఎంపీ అరి్వంద్‌ వెంటపడి మరీ పసుపు బోర్డు ఏర్పాటును సాధించుకున్నారు. మరోసారి అరి్వంద్‌ను గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల కారణంగానే నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మేం వాటిని రైతుల భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో తెరిపిస్తాం. బీడీ కారి్మకుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తాం.

రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌ 
తప్పుడు ప్రచారం: కె.లక్ష్మణ్‌ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవబోతోందని చెప్పారు.

మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ఈటల రాజేందర్‌ 
దేశం సుభిక్షంగా ఉండాలంటే.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమన్నారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)