Breaking News

భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్‌మేట్‌ శివతో వివాహేతర సంబంధం

Published on Thu, 04/03/2025 - 10:00

సంగారెడ్డి జోన్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్‌ మేట్‌ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.

రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్‌ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్‌మేట్‌ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.

 దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్‌ తీసుకొని చందానగర్‌ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్‌ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్‌ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. 

పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్, డీఐ రాజు, ఎస్‌ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)