Breaking News

నాపై కుట్రలు చేశారు 

Published on Wed, 03/29/2023 - 03:38

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాలు, ఇటు జిల్లా ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీశాయి. కాగా, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మంగళవారం స్పందించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, బురద జల్లేందుకే కొందరు సోషల్‌ మీడియా వేదికగా కుట్రలు చేశారని ఆరోపించారు.

వారి వివరాలను బయటపెడతానని స్పష్టం చేశారు. మూడు రోజులుగా సోషల్‌ మీడియా లో యువతుల కోసం చాటింగ్‌ పేరుతో వైరలైన ఫొటోలతో తనకు సంబంధంలేదని తెలిపారు. డెయిరీ విస్తరణ కోసం ఎమ్మెల్యేగా పిలిస్తే వెళ్లానని, అంతకుమించి తనకు ఏం తెలియదన్నారు. బాధిత రైతులు నిర్వాహకులపై కేసులు పెట్ట గా, కొందరు కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

డెయిరీ నిర్వాహకులపై ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే పలుచోట్ల కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని డెయిరీలో పనిచేసిన ఓ ఉద్యోగి, పలువురు రైతులు నిర్వాహకులపై ఆరోపణలు చేశా రు. కాగా, డెయిరీ భాగస్వామి షెజల్‌ మంగళవారం మరో వీడియోను విలేకరులకు విడుదల చేశారు. ‘మేం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నామంటున్నారు, ఇంతటి తో ఆపేస్తే ఆయనకు మంచిది, లేదంటే నిజాల్ని బయటపెడతా’ అని వీడియోలో పేర్కొన్నారు.   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)