Breaking News

జనజీవనంలో కలుస్తామంటే అవకాశమివ్వలేదు

Published on Fri, 11/21/2025 - 04:12

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా జీవితంలో కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు ఆ అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో చంపడం ఒక్కటే మార్గం కాదని, జన జీవన స్రవంతిలో కలుస్తామని చెప్పిన వారిని కూడా పట్టుకుని చంపడం ఏం పద్ధతి అని మండిపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వామపక్ష, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను అందరూ వ్యతిరేకించాలని, ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ పార్టీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. 

హిడ్మా, కేశవరావు, తిరుపతి వంటి వారిని నాయకులుగా గుర్తిస్తామని, వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకపోయినప్పటికీ, వారు జీవితాంతం ప్రజల కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. మావోయిస్టు నాయకులను హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీల ధర్నా, సంతకాల సేకరణ నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది.  

నరరూప రాక్షసుల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలు: కూనంనేని 
ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.  టీజేఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన కూడా కేసు నమోదు చేసి విచారించాలని జాతీయ కమిషన్‌ మార్గదర్శకాలు ఉన్నాయని, దీనిని కేంద్రం పాటించడం లేదన్నారు. 

సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రాన్ని, ప్రధాని మోదీని, బీజేపీని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. అడవుల్లోని వనరులను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు.

జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ బూటకపు ఎన్‌కౌంటర్లు ప్రభుత్వం మానుకోవాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, వివిధ పార్టీల నేతలు హన్మెశ్, చలపతిరావు,  రమేశ్‌ రాజా, భాస్కర్‌ పాల్గొన్నారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)