Breaking News

కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి

Published on Wed, 12/18/2024 - 05:11

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్‌ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్‌ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు.  

ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్‌ 
ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. గోషామహల్‌లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కారి్మకులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ కోరారు. 1950 ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.

 హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద హుజూరాబాద్‌లో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)